నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉషా సంతోష్ మేస్త్రి గెలిచారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉషా సంతోష్ మేస్త్రిని గెలిపించినందుకు మద్నూర్ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. అదేవిధంగా గ్రామాభివృద్ధికి నా పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం సంతోష్ మేస్త్రీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలి వెళ్లారు. ఈ క్రమంలో నూతన సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రీతో పాటు ముఖ్య నాయకులందరూ కలిసి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంధూర్ వార్ హనుమాన్లు, అశోక్ ,సంజయ్, చిన్నా, రాములు ,ఎమ్మెల్యే సన్నిహితుడైన సాయి పటేల్, తదితరులు పాల్గొన్నారు.
నా నమ్మకాన్ని గెలిపించారు: ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



