Friday, December 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయీస్‌ యాక్ట్‌ను పునరుద్ధరించాలి

సేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయీస్‌ యాక్ట్‌ను పునరుద్ధరించాలి

- Advertisement -

చట్టబద్ధమైన పని పద్ధతులు కల్పించాలి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య
మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ ధర్నా


నవతెలంగాణ – ముషీరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సేల్స్‌ ప్రమోషన్స్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ కండిషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ యాక్ట్‌ 1976ను తక్షణమే పునరుద్ధరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఏ.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం చలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో జరిగిన ధర్నాలో వీరయ్య మాట్లాడారు. మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్‌ల న్యాయ బద్ధమైన పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కోడ్‌లతో కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పని విధానాలలో మార్పు తీసుకొచ్చి కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నదన్నారు. మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్‌లకు చట్టబద్ధమైన పని పద్ధతులను కల్పించాలన్నారు. తక్షణమే కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌ మాట్లాడుతూ.. నాలుగు లేబర్‌ కోడ్ల ద్వారా కార్మికుల పని విధానాలలో మార్పు తెచ్చి 8 గంటల పని విధానాన్ని 12గంటలు అంతకంటే ఎక్కువ గంటలు వెట్టిచాకిరీ చేయించు కునేలా చేసిందన్నారు. ఈ లేబర్‌ కోడ్‌లు రద్దయ్యే వరకు కార్మికవర్గం పోరాడుతుందని తెలిపారు. తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.భానుకిరణ్‌ మాట్లాడుతూ.. మెడికల్‌ రిప్రజెంటేటీవ్‌లపై మందుల కంపెనీల వేధింపులు అరికట్టాలని, నిర్ధిష్టమైన పని పద్ధతులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధానాలు ఆపాలన్నారు. సంయుక్త ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారం కావని, పోరాటంతోనే 1976 యాక్టును పునరుద్ధరించుకోవాలని పిలుపునిచ్చారు. చట్టబద్ధమైన పని పద్ధతులను కల్పించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ తరలివచ్చారు. ధర్నాకు అధ్యక్ష వర్గంగా సీహెచ్‌.శ్రీధర్‌, ఐ.రాజు బట్టు వ్యవహరించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శులు జి.విద్యాసాగర్‌, సదానంద చారి, వి.శ్రీనివాస్‌, కోశాధికారి దుర్గాప్రసాద్‌, 16 జిల్లాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -