- Advertisement -
నవతెలంగాణ- రెంజల్
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గం ఎంపిక కావడంతో గ్రామపంచాయతీ భవనాలను నూతన హంగులతో సిద్ధం చేస్తున్నారు. కొన్ని గ్రామపంచాయతీలలో నిధులు లేక అనేక అవస్థలు పడుతుండగా.. మరికొన్ని గ్రామపంచాయతీల భవనాలకు పెయింట్ వేసి ఫర్నిచర్ సమకూర్చుకుంటున్నారు. మండలంలో నూతన కార్యవర్గాలు ఎంపిక కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు కేటాయించినట్లయితే తాము కూడా ఫర్నిచర్ తీసుకోవచ్చే అవకాశం ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఆయా గ్రామ పంచాయతీలకు కనీసం ఫర్నిచర్ కోసం అయినా నిధులు కేటాయించాలని గెలుపొందిన సర్పంచులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
- Advertisement -



