ముగ్గురుపై దాడి తీవ్ర గాయాలు
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని చింతగూడ గ్రామంలో పిచ్చికుక్కల స్వైర విహారం చేసి ముగ్గురుపై దాడి చేసి తీవ్ర గాయాలు చేశాయి. శుక్రవారం గ్రామంలోని కొందుకూరి మల్లవ్వ మునేసుల లక్ష్మీరాజం గుడిసెల పోసు, లను విచక్షణారహితంగా కొరకడంతో, వారిని స్థానికులు 108 వాహనంలో చికిత్స కోసం లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముందుగానే నూతన తాజా మాజీ సర్పంచ్, సుతారి సుమలత సంఘటన స్థలానికి వెళ్లి, గాయాల పాలైన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్కలు లేకుండా చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం కుక్కలు కరిచిన ముగ్గురు వ్యక్తుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. గ్రామంలో పిచ్చి కుక్కలు లేకుండా చూడాలని గ్రామస్తులు నూతన సర్పంచిని కోరారు.
చింతగూడలో పిచ్చి కుక్కల స్వైర విహారం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



