సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ర్యాలీ…నిరసన
నవతెలంగాణ – మిర్యాలగూడ
మాహత్మ గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. కేంద్ర కమిటీ పిలువుమేరకు శనివారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి అంబేత్కర్ విగ్రహం వరకు నల్ల బ్యానర్ తో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేత్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకం పోరాడి సాధించుకుందాం అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి పేరు మార్చడంతో పాటు ఆ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. పేదల పొట్ట కొట్టేందుకు కేంద్రం కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారన్నారు.
మహాత్మా గాంధీ పేరు తీసేసి వీర్ జీ రామ్ జీ పేరు పెట్టడం సరైనదికదన్నారు. ఉపాధి పథకానికి నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఈ పథకం లేకుండా చేయాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఉద్యమాలు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలతోనే ప్రజా వ్యతిరేక విధానాలు అడ్డుకోగలుగుతామన్నారు. అదేవిధంగా కార్మికుల హక్కులను కాలరాసేందుకు నాలుగు కొత్తగా లేబర్ కోడ్ లు తీసుకొచ్చారని విమర్శించారు.
ఆ చట్టాల వల్ల కార్మికుల సంక్షేమ పూర్తిగా నిర్వీరం అవుతుందన్నారు. కార్మిక, కర్షక, రైతాంగ ప్రజావ్యతిరేక విధానాలను తీపికొట్టేందుకు బలమైన ఉద్యమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, వన్ టౌన్, టూ టౌన్ కార్యదర్శులు డా. మల్లు గౌతమ్ రెడ్డి, బావాండ్ల పాండు, జిల్లా కమిటి సభ్యులు రవి నాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, రెమిడాల పరుశురాములు, సంత్యనారాయణ రావు, సర్పంచ్ బొగ్గరపు కృష్ణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పిల్లుట్ల సైదులు, ఊర్మిళ, నాయకులు కోటి రెడ్డి, గోవర్ధనా, కూన్ రెడ్డి వెంకట్ రెడ్డి, అరుణ, రామకృష్ణ, సూర్యం, శ్రీనివాస్, సుకన్య, కోడిరెక్క మల్లయ్య, మంద రాజు, బి ఎం నాయుడు, లక్ష్మీనారాయణ, దేశిరం నాయక్, దేవయ్య, పాపి రెడ్డి, జగన్, క్రాంతి, ఏసు తదితరులు పాల్గొన్నారు.




