నవతెలంగాణ – జన్నారం
యూరియా బుకింగ్ ఆప్ పై కామన్పల్లి గ్రామంలో శనివారం రైతులకు అవగాహన కల్పించటం జరిగిందని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ సయ్యద్ అక్రమ్ తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ..యూరియా కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా సునాయసంగా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆప్ తీసుకురావటం జరిగిందన్నారు. తమ సెల్ ఫోన్లలో నుంచి రైతులు ప్లే స్టోర్ నుండి ఫర్టిలైజర్ ఆప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నెంబరు, పట్టా పాస్బుక్ ఓటీపీ ద్వారా లాగిన్ అయి సాగు చేసిన పంట నమోదు చేసి డీలర్ సెలెక్ట్ చేసుకొని బుకింగ్ చేసుకోవాలని రైతులకు సూచించారు. రైతులు యాప్ ద్వారా మాత్రమే యూరియాను కొనుగోలు చేయవచ్చన్నారు. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు రామటేంకి రాజేష్, గుర్రం గోపాల్ రెడ్డి,కళ్ళెం రవీందర్ రెడ్డి, కోన శ్రీను, సంగ లక్ష్మయ్య, రాసమల్ల రమేష్, ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం నిర్వాహకులు ఎంబడి మహేష్, మల్లేష్ పాల్గొన్నారు.
యూరియా బుకింగ్ యాప్ పై అవగాహన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


