Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫుడ్ సేఫ్టీపై రెజిస్ట్రేషన్, లైసెన్స్ మేళ 

ఫుడ్ సేఫ్టీపై రెజిస్ట్రేషన్, లైసెన్స్ మేళ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
ఈ నెల 22 సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని రూమ్ నెంబర్ 25,లో ఉదయం  11.00 గంటల నుంచి రెజిస్ట్రేషన్, లైసెన్స్ మేళను నిర్వహించనున్నట్లు ఫుడ్ సేఫ్టీ డేసిగ్నేటేడ్  ఆఫీసర్ శిరీష ఒక ప్రకటనలో  తెలిపారు. ప్రతి ఆహార వ్యాపార నిర్వహకుడు లైసెన్స్ లేకపోతే సదరు పత్రాలు సమర్పించి లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె కోరారు. లైసెన్స్ రిజిస్ట్రేషన్ లేకుండా ఆహారానికి సంబంధించిన వ్యాపారాలు చేస్తే వారికి రూ.5 లక్షల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. ప్రతి ఆహార వ్యాపార నిర్వాహకుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ కొరకు ఆధార్ కార్డు జిరాక్స్, గ్రామ పంచాయతీ , మునిసిపల్ లైసెన్స్ జిరాక్స్ , పాస్టపోర్ట్ సైజు ఫోటో , కరెంటు బిల్, జీఎస్టీ లైసెన్స్ తీసుకుని రావాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -