Saturday, December 20, 2025
E-PAPER
Homeఆదిలాబాద్క్షయ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలి

క్షయ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలి

- Advertisement -

మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఉమాశ్రీ
నవతెలంగాణ – జన్నారం

వివిధ వ్యాధులతో బాధపడేవారు క్రమం తప్పకుండా మందులు వాడాలని జన్నారం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు డా. ఉమా శ్రీ సూచించారు. జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామంలో శనివారం టీవీ ముక్త్ భారత్  కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన టీబీ వ్యాధి గుర్తింపు అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. జ్వరం, దగ్గుతో బాధపడేవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

 బాధితులకు ఉచితంగా 100 మందికి X-ray, 35 మందికి థెమడ పరీక్షలు, 62 మందికి HIV మరియు 62 మందికి సిఫిలిస్ వ్యాధి పరీక్షలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బి సురేశ్, ఎస్టిఎస్  ఆంజనేయులు, హెచ్ఐవి  కౌన్సిలర్,లక్ష్మి HS(F),Pooja MLHP, K. వసంత HA(F). T. పోచయ్య HA (M)మరియు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -