- Advertisement -
నవతెలంగాణ జన్నారం
జన్నారం మండలంలోని పలు గ్రామాల పంచాయతీ కార్యాలయాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులతో 22న ప్రమాణ స్వీకారం చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మండలంలోని బాదంపల్లి గ్రామపంచాయతీని కార్యదర్శి సంతోష్ ఆధ్వర్యంలో సున్నాలు వేయిస్తున్నారు. 22న నూతన సర్పంచ్ విజయలక్ష్మి లక్ష్మీరాజం, పో నకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సుష్మా భూమేష్ తో సహా 29 గ్రామపంచాయతీలలో సర్పంచులు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పలు పంచాయతీలను కూడా అధికారులు ముస్తాబు చేశారు.
- Advertisement -



