Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణితమే జీవిత గమనం

గణితమే జీవిత గమనం

- Advertisement -

– మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య 
మండల స్థాయి గణిత ప్రతిభ పాఠవ పరీక్ష
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
గణితమే జీవిత గమనమని మండల విద్యాశాఖ అధికారి ఆంధ్రయ్య అన్నారు.విద్యార్థుల్లో చాలా మందికి గణితం అంటే ఒక భయం ఉంటుందని, దానిని అధిగమిస్తే  మంచి ఫలితాలు పొందవచ్చని సూచించారు. శనివారం రామానుజన్ జయంతిని పురస్కరించుకుని మండల విద్యా వనరుల కేంద్రంలో  మండల స్థాయి గణిత ప్రతిభ పాఠవ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణితం యొక్క గొప్పతనాన్ని వివరించారు. గణిత సబ్జెక్టులో పూర్తిస్థాయి పట్టు సాధిస్తే అన్ని అంశాలను ముందంజలో ఉండవచ్చని స్పష్టం చేశారు.

పదవ తరగతి పరీక్షలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రణాళిక బద్ధంగా ముందడుగు వేయాలని, మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర సలహాదారులు, కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాం ప్రసాద్ విద్యార్థులందరికీ గణిత ఫార్ములాలు అందజేశారు. మండల స్థాయిలో ఆంగ్ల మధ్యమంలో ఎస్ ప్రణవి, సిహెచ్.మధుప్రియ, బి.ప్రణవి, యెనుగందుల సోమిత్ లు వరుసగా మూడు స్థానాలు సాధించి జిల్లాకు ఎంపికయ్యారు. తెలుగు మాధ్యమంలో కే.లికిత, ఏం.రచిత, కే.గంగాదేవిలు  వరుసగా మూడు స్థానాలు సాధించి జిల్లా ఎంపికయ్యారు. విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -