- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచిగా ఎన్నికైన ఉషా సంతోష్ మేస్త్రి శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఎంపీడీవో రాణిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాణి మాట్లాడుతూ.. మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి, అలాగే గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేసి గ్రామ ప్రజల మన్న నాలు పొందాలని సూచించారు. ఈ క్రమంలో తనను సన్మానించినందుకు ఎంపీడీవో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, నాయకులు సంగయ్యప్ప, కర్రే వార్ రాములు, సాహెబ్రావు, హనుమాన్లు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



