సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు ప్రపంచమంతటా విద్యా పద్ధతులను పునర్నిర్మిస్తున్న ఈ నూతన యుగంలో, తమిళనాడు ప్రభుత్వం గ్రంథాలయ వ్యవస్థను పూర్తిగా మార్చివేయడానికి దిశానిర్దేశక చర్యలు చేపట్టింది. పుస్తకాల సేకరణ స్థావరాలుగా మాత్రమే కాకుండా, ఆధునిక జ్ఞాన కేంద్రాలుగా, సృజనాత్మక ఆవిష్కరణలకు వేదికలుగా, శిక్షణ -సహకార కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాలను తీర్చిదిద్దుతోంది. ఈ ప్రణాళిక కేవలం భౌతిక నిర్మాణాల నిర్మాణమే కాకుండా, విద్యార్థులు, ఉద్యోగార్థులు, పరిశోధకులు, పారిశ్రామిక నైపుణ్యాల అభివృద్ధి కోరే యువతకు సమగ్రమైన వేదికను అందించడం లక్ష్యం.
భారీ పెట్టుబడులు, అభివృద్ధి కేంద్రాల ప్రణాళిక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ. 800 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, సేలం, తిరునెల్వేలి, కడలూరు నగరాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక గ్రంథాలయ-శాస్త్ర కేంద్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. వీటికి తోడు, టెంకాసి, రాణిపేట, తిరుప్పత్తూరు, కల్లకురిచ్చి, కాంచీపురం, మయిలాదుతురాయి, ఈరోడ్, తూతుకుడి జిల్లాల్లో రూ. 50 కోట్ల అదనపు పెట్టుబడితో కొత్త కేంద్ర గ్రంథాలయాలు ఏర్పాటవుతున్నాయి. ఈ నిర్మాణాలు కేవలం భవనాలే కాకుండా, ప్రతీ జిల్లాకు తగిన అవసరాల దష్ట్యా ప్రణాళికాబద్ధంగా రూపొందించబడ్డాయి.

స్థానిక అవసరాలు, సాంకేతిక సమన్వయం: ప్రతీ పట్టణం సామాజిక, పారిశ్రామిక, విద్యా నేపథ్యాన్ని దష్టిలో ఉంచుకుని గ్రంథాలయాల రూపకల్పన నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు, కోయంబత్తూరులోని థంతై పెరియార్ గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం అక్కడి పారిశ్రామిక సంస్కతిని ప్రతిబింబిస్తూ స్టార్టప్‌ల కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ కేంద్రం ఉంది. తిరుచిరాపల్లిలో నిర్మితమవుతున్న కె. కామరాజ్ గ్రంథాలయం A× పరిశోధన, రోబోటిక్స్, సాంకేతిక పునరావిష్కరణలకు వేదికగా రూపుదిద్దుకుంటోంది. అదే విధంగా, కడలూరులో వికసిస్తున్న గ్రంథాలయం ఫ్రీలాన్స్ వత్తిపరులు, ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు తక్కువ వ్యయంతో కూడిన సహ-కార్యాలయ స్థలాన్ని అందిస్తుంది.
ప్రథమంగా చెన్నైలోని కొలతూర్ నియోజకవర్గంలో ప్రారంభించిన షశీషశీతీసఱఅస్త్ర సెంటర్ ప్రజాదరణ పొందిన తర్వాత, ప్రభుత్వం చెన్నై నగరంలోని 20 ప్రదేశాల్లో ఇటువంటి ప్రాజెక్టులను విస్తరిస్తోంది. దీని ఫలితంగా ఈ కేంద్రాలు సాంకేతికంగా అనుసంధానమైన, ఆర్థికంగా అందుబాటులో ఉన్న, పారిశ్రామిక వాతావరణాన్నిచ్చే వేదికలుగా మారనున్నాయి.
డిజిటల్ రీసోర్సులు, ఆన్‌లైన్ ప్రాప్యత: తమిళనాడు ప్రభుత్వం ఈ కొత్త గ్రంథాలయాలను డిజిటల్ లెర్నింగ్ కేంద్రాలుగా రూపాంతరం చెయ్యడంలో ప్రధాన దృష్టి పెడుతోంది. ప్రతి గ్రంథాలయంలో లక్షల సంఖ్యలో భౌతిక పుస్తకాలతో పాటు లక్షలాది ఈ-పుస్తకాలు, ఆన్‌లైన్ జర్నళ్లు, విద్యా డేటాబేసీలు ఉంటాయి. ఆన్‌లైన్ లైబ్రరీల ద్వారా విద్యార్థులు పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక, మానవీయ వనరులను సులభంగా వినియోగించుకోవచ్చు.
చదువరులకు ప్రత్యేక పఠన మండలులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు రెఫరెన్స్ విభాగాలు, పుస్తకావిష్కరణలు, సాహిత్య సంభాషణలు, అకాడెమిక్ సెమినార్‌లు నిర్వహించడానికి సమావేశ మందిరాలు ఏర్పాటు అవుతున్నాయి. ఈ సదుపాయాలు ప్రైవేట్ స్టడీ సెంటర్లపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, సమాన అవకాశాలను కల్పిస్తున్నాయి.
పౌరులకు ఉచితం సౌకర్యాలు: ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా ఈ సౌకర్యాలను అందిస్తోంది. బీ. చంద్ర మోహన్ (ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ) చెప్పినట్లు, చాలా మంది విద్యార్థులు ఇలాంటి సదుపాయాల కోసం నెలకు రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు ప్రైవేట్ సెంటర్లలో ఖర్చు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు వీటిని ప్రభుత్వ గ్రంథాలయాల్లో పూర్తిగా ఉచితంగా పొందగలరు. ఇది విద్యలో సమానతను స్థాపించే దిశగా తీసుకున్న కీలక అడుగుగా భావించబడుతోంది.
జ్ఞానం, సజనాత్మకత సహకారానికి కేంద్రాలు: ప్రతి ఆధునిక గ్రంథాలయం శుభ్రమైన వాతావరణంతో, సౌకర్యవంతమైన కూర్చునే ప్రదేశాలతో, ఔఱ-ఖీఱ సదుపాయాలతో, షశీషశీతీసఱఅస్త్ర ప్రాంతాలతో వెయ్యి మందికి పైగా కూర్చునగలిగే పెద్ద సభామందిరాలతో ఉండనుంది. ఈ వేదికలు విద్యార్థులు, ఎంట్రప్రెన్యూర్లు, పరిశోధకులు, పౌర సమాజ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకువస్తాయి.
ఈ గ్రంథాలయాలను ‘జీవంతమైన అధ్యయన కేంద్రాలు’గా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఇవి పుస్తకాలతో పాటు ప్రసార సాంకేతికత, సమాచార భాగస్వామ్యం, మరియు సృజనాత్మక ఆలోచనల రూపకల్పనకు కూడా వేదికను కల్పిస్తాయి. ఇలాంటి మార్పులు ”కమ్యూనిటీ లెర్నింగ్” (షశీశ్రీశ్రీవష్‌ఱఙవ శ్రీవaతీఅఱఅస్త్ర) అనే భావనను బలపరిచి, కొత్త తరానికి అనుకూలమైన విద్యా నమూనా ఏర్పరుస్తాయి.

మదురై, చెన్నై మోడళ్ల స్ఫూర్తి: తమిళనాడు గ్రంథాలయ నవీకరణ ప్రణాళికకు స్ఫూర్తి కలిగించింది మదురైలోని కలైంజర్ శతజయంతి గ్రంథాలయం. 2021లో డీఎంకే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 2023లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నేడు రోజుకు 3,000 మందికి పైగా అక్కడికి వస్తున్నారు. ఈ విజయమే రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ‘స్మార్ట్ లైబ్రరీలు’ రూపకల్పన చేయడానికి ప్రేరణ అయింది.
ఈ ప్రయత్నాలకు మూలం చెన్నైలో 2011లో నిర్మించబడిన అన్నా శతజయంతి గ్రంథాలయం. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ప్రజా గ్రంథాలయాలలో ఒకటి. విద్యార్థులు, పరిశోధకులు, సాహిత్యప్రియులు ఈ కేంద్రాన్ని అధ్యయనానికి ఒక ప్రతీకగా స్వీకరించారు. ఈ అనుభవం ఆధారంగా, తమిళనాడు ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక ఆధునిక ”కేంద్ర గ్రంథాలయ మోడల్”ను అభివద్ధి చేయాలని నిర్ణయించింది.
విద్యావృద్ధి, సామాజిక మార్పు: ఈ ప్రాజెక్టులు కేవలం విద్యా వసతులను మాత్రమే కాకుండా సామాజికంగా సమాన అవకాశాలను కల్పించే మార్గాన్నీ సృష్టిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు టియర్ -××, టియర్-××× నగరాలవైపు వచ్చే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆన్‌లైన్ విద్య, డిజిటల్ పుస్తకాలు, స్మార్ట్ పఠన సదుపాయాలు పట్టణాలు-గ్రామాల మధ్య విద్యా విభిన్నతను తగ్గిస్తాయి. పరిశోధకులు, ప్రొఫెషనల్స్, సాంకేతిక రంగ నిపుణులు ఈ ప్రదేశాలను జ్ఞాన పరస్పర మార్పిడి వేదికలుగా వినియోగించవచ్చు. ఇది ‘లైబ్రరీ-అజ్-ఎ-ప్లాట్ఫార్మ్’ అనే ఆధునిక భావనకు ఉత్తమ ఉదాహరణగా నిలుస్తోంది.
భవిష్యత్ దిశ: ఈ మార్పులు రాష్ట్రపు విద్యా-సాంకేతిక వ్యవస్థకు కొత్త గుర్తింపును తెస్తున్నాయి. భవిష్యత్తులో ప్రతి గ్రంథాలయం ‘ఇన్నోవేషన్ హబ్’గా అభివృద్ధి చెందుతుందన్న ఆశ ప్రభుత్వానికి ఉంది. దాంతో పాటు, ఈ కేంద్రాలు రాష్ట్ర యువతలో ఇంజినీరింగ్, సైన్స్, సృజనాత్మక పరిశోధనల వైపు ఆసక్తిని పెంచుతాయి. తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రస్ధానం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శమర్యాద కల్పించగలదని విద్యావేత్తలు, లైబ్రరీ నిపుణులు భావిస్తున్నారు. ఇది ప్రజా గ్రంథాలయాల పట్ల కొత్త దృక్పథాన్ని తెచ్చి, గ్రంథాలయాన్ని ఒక్క అధ్యయన స్థలం కాకుండా సమాజ పురోగతికి సహకార యంత్రాంగంగా నిలుపుతోంది.
– డా|| రవికుమార్ చేగొని, 9866928327



