వాక్ ఇన్ ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్: మిస్టర్ ఏంటిది? ఇంటర్వ్యూకి వచ్చిన వాడివి కూచుని అడిగిన వాటికి సమాధానాలు చెప్పాలి గాని ఇలా అటూ ఇటూ నడుస్తున్నావేంటి?
అభ్యర్ధి: మీరిచ్చిన యాడ్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని ఉంది కదా సార్. అందుకని.
కూచుని తింటే…
ఒక చోట డిన్నర్ లో ఓ వ్యక్తి: ఏమండీ ఎప్పటినుండో నాకో డౌటు. ఈ బఫే డిన్నర్లో అందరూ నిలబడి తింటారెందుకు?
అవతలి వ్యక్తి: కూచుని తింటే కొండలైనా తరిగిపోతాయట. అందుకని
ఋణాలిప్పిస్తారని…
ఓ రాజకీయ నాయకుడు (సభ ముగిసాక) : ఏంటోయ్ సెక్రటరీ వీళ్ళంతా నా వెనకబడ్డారు?
సెక్రటరీ: వెనుక బడిన వాళ్ళందరికీ ఋణాలిప్పిస్తానని ఇప్పుడు మీరే కదా సర్ చెప్పారు. అందుకని…..
తలవంపులు
తండ్రి (కొడుకుతో): నీ ప్రవర్తనవల్ల నాకెంత తలవంపుగా ఉందో తెలుసా?
కొడుకు: లేదు నాన్నా! నీ తల బాగానే ఉంది. వంపుగా లేదు
నవ్వుల్ పువ్వుల్
- Advertisement -
- Advertisement -



