నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంటర్మీడియెట్ బోర్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా వెన్న జగదీశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చల్లా జయనాగ సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్ నాంపల్లిలో ఇంటర్మీడియెట్ బోర్డు ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా సంయుక్త కార్యదర్శి భీమ్‌సింగ్, మోహన్, బాబురావు, సంజయ్ కుమార్‌లు వ్యవహరించారు. సభ్యులు నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా జగదీశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చల్లా జయనాగ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులుగా తోట మురళీధర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా చంద్రమౌళి, కోశాధికారిగా వంశీకృష్ణ, మహిళా ప్రతినిధిగా స్వప్న జోషి, క్రీడల కార్యదర్శిగా ఎల్పుల మధు ఎన్నికయ్యారు.
ఇంటర్ బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా జగదీశ్వర్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



