నవతెలంగాణ-హైదరాబాద్: మండలంలోని ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా, బస్సులో ప్రయాణిస్తున్న ముప్పై మందికి స్వల్ప గాయాలయైనట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా వద్ద ఆగి ఉన్న లారీని బోధన్ డిపో చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు నుంచి నిజామాబాద్ వెళుతుండగా ఢీ కొట్టింది. దీంతో లారీ టైరు మారుస్తున్న క్లినర్ నితీష్ కుమార్ రామ్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి ఘటన స్థలానికి హుటాహుటన చేరుకుని పరిశీలించారు. గాయపడిన ప్రయాణికులను వైద్యశాలకు, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు బీహార్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీష్ తెలిపారు.
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



