పోరెడ్డి మదుల పుస్తకాల ఆవిష్కరణ
పోరెడ్డి (సిరికొండ) మదుల రచించిన ‘రుధిరం నుండి క్షీరం దాకా’, ‘అవిభాజ్యం’ కవితా సంపుటల ఆవిష్కరణ సభ ఈ నెల 22న రాత్రి 8 గంటలకు హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఆవిష్కరిస్తారు.
పుస్తకావిష్కరణ సభ
డా. కాసుల లింగారెడ్డి కవిత్వం ‘ఒక ఆకుపచ్చకల’ ఆవిష్కరణ సభ ఈ ననెల 23న సాయంత్రం 8 గంటలకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ తెలంగాణ కళాభారతిలో జరుగుతుంది. ఈ సభకు శ్రీధర్ గాజుల, కాసుల ప్రతాప్ రెడ్డి, కె.శ్రీనివాస్, విమల మోర్తల, వి.ఆర్.తుమలూరి పాల్గొంటారు.
పుస్తకావిష్కరణ సభ
డా. కాసుల లింగారెడ్డి కవిత్వం ‘ఒక ఆకుపచ్చకల’ ఆవిష్కరణ సభ ఈ నెల 23న సాయంత్రం 8 గం.లకు.హైదరాబాద్ బుక్ ఫెయిర్ నందు జరుగుతుంది. ఇందులో శ్రీధర్ గాజుల, కాసుల ప్రతాప్ రెడ్డి, కె.శ్రీనివాస్, విమల మోర్తల, వి.ఆర్.తుమలూరి పాల్గొంటారు.
శ్రీధర్ గాజుల
28న ఓల్గా ఆత్మీయ అభినందన సభ
ఖమ్మం ‘స్వేచ్ఛావరణం’ బహిళాబృందం ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా సాహిత్య ఉత్సవాన్ని ఖమ్మం వేదిక ఫంక్షన్ హాల్‌లో ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నది. ఇందులో ఓల్గా సాహిత్య పరిచయ పుస్తకం ‘ఓల్గా తీరం’ ఆవిష్కరించనున్నారు. ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడెమీ తెలుగు విభాగం కన్వీనర్ సి.మృణాళిని, ఇంకా సాహితీవేత్తలు పాల్గొంటారు. ఇందులో ఓల్గా రచించిన రూపకాలు ప్రదర్శించబడతాయి.
సాహితీ మితృలందరికీ ఆహ్వానం.
సుమతి, సునంద
భూతం విమల పురస్కారంకు కథా సంపుటాల ఆహ్వానం
తెలంగాణ సాహితీ, భూతం విమల స్మారక సాహితీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీమతి భూతం విమల స్మారక పురస్కారం – 2026 కోసం 2022 నుండి 2025 మధ్యకాలంలో సామాజిక స్పహతో రాసిన కథా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. జనవరి 26, 2026 నాడు శ్రీమతి భూతం విమల రెండవ వర్ధంతిన నల్లగొండలో బహుమతి ప్రధానం జరుగుతుంది. జనవరి 10 లోపు కథా సంపుటాలను మూడేసి(3) ప్రతులు దిగువ చిరునామాకు పంపించాలి. చిరునామ: ఇం.నెం.4 – 11 – 117/1, చైతన్యపురి కాలనీ రోడ్ నెంబర్ 2, జి.వి. గూడెం రోడ్డు, నల్లగొండ. 508001 తెలంగాణ. సెల్: 7893033077.
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -



