సాహితీ వార్తలు

12న అలిశెట్టి పురస్కార ప్రధాన సభ
తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యాన జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్‌ రాష్ట్ర స్థాయి పురస్కార సభ కరీంనగర్‌ ఫిల్మ్‌ భవన్‌ లో సాయంత్రం 5 గంటలకు జరుగనుంది. ఈ సంవత్సరం పురస్కారం కవయిత్రి తోట నిర్మలారాణికి ప్రదానం జరుగుతుంది. పురస్కార జ్ఞాపిక, నగదు బహుమతి ఉంటుంది. – సి.వి.కుమార్‌-కరీంనగర్‌

చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక సాహిత్య పురస్కారం
శ్రీలేఖ సాహితి, వరంగల్లు వారు 2023 సంవత్సరానికి విశిష్టాద్వైత సాహిత్యమునకు ”చెన్నమనేని రంగనాయకమ్మ గారి స్మారక సాహిత్య పురస్కారమును” ఇవ్వనున్నారు. విశిష్టాద్వైత సాహిత్యగ్రంధాలు (పద్యకావ్యాలు, వ్యాససంపుటాలు) 2019 – 2023 సంవత్సరాల్లో ప్రచురించబడి ఉండాలి. పురస్కారం క్రింద రూ.5000/-, శాలువా, మెమొంటోతో సత్కరిస్తారు. పరిశీలన నిమిత్తం నాలుగు ప్రతులు 29 ఫిబ్రవరి 2024 లోగా డాక్టర్‌ టి. శ్రీరంగస్వామి, అధ్యక్షులు, శ్రీలేఖసాహితి, ఇం.నం. 27-14-53, లిటిల్‌ సోల్జర్స్‌ స్కూల్‌ లేన్‌, మండల కార్యాలయము ఎదురుగ, హసన్‌ పర్తి 506371, హన్మకొండ వరంగల్‌ తెలంగాణ, ఫోన్‌ నం. 99498 57955.

ఉగాది బాలల కథల పోటీ -2024
ఉగాది సందర్భంగా బాలల్లో సాహిత్య అభిరుచి పెంపొందించి, తద్వారా వారిలో దాగివున్న సజనాత్మకతను వెలికితీయాలనే ఉదేశ్యంతో సిద్దిపేట జిల్లా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుచున్న విద్యార్థుల నుండి కథలను ఆహ్వానిస్తున్నారు. ప్రథమ (1500/-), రెండు ద్వితీయ బహుమతులు (1000/-), మూడు తతీయ బహుమతులు (500/-), 12 ప్రత్యేక బహుమతుల (300/-)ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు మర్పడగ చెన్నకష్ణారెడ్డి అందిస్తున్నారు. హామీ పత్రంతో పాటు విద్యార్థులు రాసిన కథలను ”కన్వీనర్‌, ఉగాది కథల పోటీ,ప్రతిభ డిగ్రీ కళాశాల, మెదక్‌ రోడ్‌ సిద్దిపేట-502103 చిరునామా కు 2024 జనవరి, 31వ తేదీలోగా పంపగలరు. వివరాలకు 9959007914 నంబర్‌ లో సంప్రదించవచ్చు.

పోస్టు కార్డు కథల పోటీ
సాహితీ కిరణం గౌరవ సంపాదకులు గుదిబండి వెంకటరెడ్డి 83వ జన్మదినం సందర్భంగా సాహితీకిరణం ఆధ్వర్యంలో పోస్టుకార్డుల కథల పోటీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో 5 బహుమతులు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పన వుంటుంది. కథ పోస్టు కార్డుపైనే సామాజిక అంశంతో రాయాలి. ఎంపికైన 83 కథలతో కథా సంకలనం ప్రచురిస్తారు. రచయితలు కథలను ఫిబ్రవరి 29 లోపు ‘ఎడిటర్‌, సాహితీకిరణం, 11-13-154, రోడ్‌ నెం.3, అలకాపురి, హైదరాబాద్‌ – 500102 చిరునామాకు పంపాలి. వివరాలకు : 9849882783 నెంబరును సంప్రదించవచ్చు.

రజనీశ్రీ రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారానికి నవలల ఆహ్వానం
ప్రముఖ నటులు, కవి, నాటక రచయిత, నాట్యాచార్యులు రజనీశ్రీ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం జాతీయ సాహిత్య పరిషత్‌- కరీంనగర్‌ నవలలను ఆహ్వానిస్తుంది. జనవరి1, 2014 నుండి 31 డిసెంబర్‌ 2023 లోగా ముద్రించబడిన స్వంత నవలలు (అనువాదాలు వద్దు) నాలుగు ప్రతులను ‘గాజుల రవీందర్‌, ఇ.నం. 8-3-255/1, రామచంద్రాపూర్‌ కాలనీ, రోడ్‌ నంబర్‌ 12, భగత్‌ నగర్‌, కరీంనగర్‌ -505001’ చిరునామాకు ఫిబ్రవరి 10, 2024 లోపు పంపాలి. వివరాలకు గాజుల రవీందర్‌, 9848255525.

Spread the love