Monday, December 22, 2025
E-PAPER
Homeసినిమానాడియా పాత్రలో కియారా..

నాడియా పాత్రలో కియారా..

- Advertisement -

యష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’. తాజాగా ఈ మూవీ నుంచి నాడియా పాత్రని పోషిస్తున్న హీరోయిన్‌ కియారా అద్వానీ ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.
ఎమోషనల్‌, హై వోల్టేజ్‌ కమర్షియల్‌ మూవీస్‌ ఇలా… వైవిధ్యమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంది కియారా అద్వానీ. ఇప్పుడు గీతూ మోహన్‌ దాస్‌ రూపొందిస్తున్న శక్తివంతమైన ప్రపంచంలోకి నాడియా పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ పాత్ర ఆమె ఫిల్మోగ్రఫీ రేంజ్‌ని మరింత పెంచేలా సరికొత్తగా ఉంది. నాడియాగా కియారా అద్వానీ పస్ట్‌ లుక్‌ ఆసక్తికరంగా ఉంది. ఆమె పాత్రలో లోతైన భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. ఈ హంగామా వెనుక బాధ, విషాదం ఏదో ఉన్నట్లుగా అనిపిస్తోంది.

ఆమె పాత్ర నటనకు ప్రాధాన్యతనిచ్చేలా కనిపిస్తోంది. డైరెక్టర్‌ గీతూ మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ, ‘కొన్ని పాత్రల్లో నటించినప్పుడు అవి సినిమాకే పరిమితం కావు. యాక్టర్‌కు సరికొత్త గుర్తింపును తీసుకొస్తాయి. నాడియా పాత్రలో కియారా చేసిన నటన డిఫరెంట్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కనిపిస్తుంది. ఆమె నటన చూసి చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ఈ ప్రయాణంలో నాపై, నా టీమ్‌పై నమ్మకం పెట్టుకుని, మనస్ఫూర్తిగా ఆమె సపోర్ట్‌ చేసిన తీరుకి ధన్యావాదాలు’ అని అన్నారు. ఇంగ్లీష్‌, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అలాగే ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతోపాటు మరికొన్ని భాషల్లో డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తున్నారు. కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై వెంకట్‌ కె.నారాయణ, యష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2026 మార్చి 19న ఈద్‌, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్‌ వీకెండ్‌ సమయంలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -