షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలుగా ఆది సాయి కుమార్ హీరోగా రానున్న చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను ఈనెల 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అంచనాల్ని మరింతగా పెంచేందుకు ‘శంబాల’ మిస్టిక్ ట్రైలర్‌ను హీరో నానితో ఆదివారం రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ని ఇప్పుడే చూశాను. అద్భుతంగా ఉంది. ఇలాంటి జోనర్ చిత్రాల్నే ఆడియెన్స్ ఇప్పుడు కోరుకుంటున్నారు.
ఇలాంటి సినిమాల్ని కరెక్ట్‌గా చేస్తే, టెక్నికల్‌గా, మేకింగ్ పరంగా సెట్ అయితే ఎలాంటి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తుందో ఇది వరకే చూశాం. ఈ ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఇంగ్లీష్ సాంగ్ కూడా అదిరిపోయింది. ఆ పాట చాలా స్టైలీష్‌గా ఉంది. ఆది నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. మంచి నటుడు, మంచి డ్యాన్సర్. మంచి నటుడికి మంచి సినిమా పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో ఆదికి మంచి విజయం దక్కాలి. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు. ఆకాశం నుంచి ఓ ఉల్క పడటంతో ట్రైలర్ మొదలైంది. ‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైనది కాదు’.. అనే డైలాగ్‌తో ఆ ఉల్క శక్తిని చూపించారు. ఇక ఊర్లో అందరూ వింతగా ప్రవర్తిస్తుండటం, ఆ ఉల్కను కట్టడి చేసేందుకు పూజలు చేయడం, మఠాధిపీతుల్ని తీసుకురావడం చూపించారు. ఇక మిస్టరీని ఛేదించేందుకు నాస్తికుడైన హీరో రంగంలోకి దిగితే ఏం జరిగిందనేది ఆద్యంతం ఆసక్తికరంగా చూపించారు.
ఇది సాధారణమైనది కాదు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



