Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విజయ్ హైస్కూల్ లో బాల కవి సమ్మేళనం 

విజయ్ హైస్కూల్ లో బాల కవి సమ్మేళనం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలోని విజయ్ హై స్కూల్ లో సోమవారం బాల కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుజి. రమాదేవి సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్కూల్ కరెస్పాండెంట్ టి. కవితాదివాకర్  మాట్లాడుతూ… చిన్న పిల్లలలో దాగి ఉన్న కవిత్వ ప్రతిభను వెలికి తీసే ఒక మంచి వేదిక అని అన్నారు. ఈ సమ్మేళనం లో బాలబాలికలు తమ భావాలను కవిత రూపంలో వ్యక్తపరుస్తారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంచి, సాహిత్యంపై ఆసక్తిని కలిగిస్తాయని అన్నారు. భవిష్యత్తు కవులకు ఇది తొలి మెట్టుగా ఉపయోగపడుతుందని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో కొన్ని అంశాలను ఎంపికచేసి వాటిని మూడవ తరగతి నండి ఐదవ తరగతి విద్యార్థులకు సీతాకోక చిలుక ఆరవ తరగతి నుండి ఏడవ తరగతి విద్యార్థులకు ‘చిత్రం ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు కవి / రచయిత అనే అంశాలపై పండుగ వాతావరణంలో సాంప్రదాయ దుస్తులు ధరించి కవితలను వినిపించారు. ఈ పోటీలలో మొదటి స్థానం, రెండవ స్థానం, మూడవ స్థానం కన్సోలేషన్ బహుమతులు ఇచ్చారు. కవితలు చదివిన ప్రతి విద్యార్థికి బహుమతిగా ఒక పెన్ను మరియు ఒక బిస్కట్ పాకెట్ ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -