Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకుందాం: సర్పంచ్ అశ్విని సుదర్శన్

చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకుందాం: సర్పంచ్ అశ్విని సుదర్శన్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని మద్నూర్ మండలంలోని తడి ఇప్పర్గా గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నా గ్రామ ప్రజలను కోరారు. ఆ గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారోత్సవ అనంతరం సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కలిసి మొట్టమొదట గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశ్విని మాట్లాడుతూ.. ప్రజలకు మొక్కలు ఎంతో అవసరమని, మొక్కలను నాటి చెట్లుగా పెంచుకుంటే ప్రజలకు కావలసిన ఆక్సిజన్ లభిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ఉపసర్పంచ్ అంజలి, సూర్యవంశం వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ ప్రకాష్ గైక్వాడ్, గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -