Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్23న భూపాలపల్లి జిల్లా మెన్ అండ్ ఉమెన్ మోడ్రన్ కబడ్డీ సెలక్షన్స్

23న భూపాలపల్లి జిల్లా మెన్ అండ్ ఉమెన్ మోడ్రన్ కబడ్డీ సెలక్షన్స్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లాలో మోడ్రన్ కబడ్డీ  అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో జిల్లాస్థాయి మెన్ అండ్ ఉమెన్ మోడ్రన్ కబడ్డీ సెలక్షన్స్ ను ఈనెల 23వ తేదీ మంగళవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు మండలం ఎడ్లపల్లి మోడల్ స్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు పసుల లక్ష్మణ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కల రాజబాబు పేర్కొన్నారు. ఈ క్రీడలలో పాల్గొనే క్రీడాకారులు తమ ఆధార్ కార్డుతో పాటు కబడ్డీ కిట్టు తీసుకొని రావాలని తెలిపారు. బరువు 85 కిలోల లోపు ఉన్నవారు ఈ సెలక్షన్స్ కి అర్హులు ఈ క్రీడలలో నైపుణ్యం కనబరిచిన వారు ఈనెల 26 నుండి ఖమ్మంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారు కావున క్రీడాకారులు గమనించి క్రీడలలో పాల్గొని నైపుణ్యాన్ని కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని విజయవంతం చేయాలని కోరారు. సంప్రదించవలసిన నెంబర్లు 8639346695, 9010677080 తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -