Wednesday, December 24, 2025
E-PAPER
Homeబీజినెస్ఐదేండ్లలో రూ.9వేల కోట్ల రెవెన్యూ లక్ష్యం

ఐదేండ్లలో రూ.9వేల కోట్ల రెవెన్యూ లక్ష్యం

- Advertisement -

అప్పురహిత సంస్థగా రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ : ఆ కంపెనీ సీఈఓ సునీల్‌ నాయర్‌ వెల్లడి
నవతెలంగాణ- హైదరాబాద్‌

నీటి నిర్వహణ, ఇండిస్టియల్‌ పార్కులు, అర్బన్‌ సొల్యూషన్స్‌ రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తోన్న రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తోన్నట్లు ప్రకటించింది. ఇటీవల అప్పురహిత సంస్థగా మార్చినట్టు వెల్లడించింది. వచ్చే ఐదేండ్లలో రెవెన్యూలో ఐదు రెట్ల వృద్ధిని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌లో రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) సునీల్‌ నాయర్‌, చీఫ్‌ ఫైనాన్సీయల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ) శ్రవంత్‌ రాయపూడితో కలిసి మీడియాతో మాట్లాడారు. 2025 ముగింపు నాటికి తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడానికి వీలుగా అప్పురహిత కంపెనీగా మార్చామన్నారు. గత ఐదేండ్లుగా చేపట్టిన పునర్నిర్మాణ ప్రక్రియ ముగిసిందని.. ప్రస్తుతం స్టాండ్‌లోన్‌ స్థాయిలో ఎటువంటి టర్మ్‌ అప్పులు లేవన్నారు. కేవలం పూర్తి చేసిన ఒక ప్రాజెక్టుకు సంబంధించి రూ.160 కోట్ల రుణం మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం కంపెనీ రెవెన్యూ రూ.2వేల కోట్ల పైగా ఉందన్నారు. ప్రతీ ఏడాది సగటున 25-30 శాతం వృద్ధితో వచ్చే ఐదేళ్లలో ఐదు రెట్ల వృద్ధితో 1 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ9వేల కోట్లు) రెవెన్యూ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -