Wednesday, December 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి

పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి

- Advertisement -

– బిల్లులు ఇస్తేనే లెప్రసీ సర్వే : ఆశా వర్కర్ల డిమాండ్‌
– రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
నవతెలంగాణ- విలేకరులు

పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. పెండింగ్‌ బకాయిలు చెల్లిస్తేనే లెప్రసీ సర్వే చేస్తామని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. వేములవాడ రూరల్‌ మండలంలోని హన్మాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశా కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించి, మండల వైద్యాధికారి సారియా అంజుమ్‌కు వినతిపత్రం సమర్పించారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ధర్నాలు చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో, కోటకొండ పీహెచ్‌సీ ఎదుట ఆశాలు ధర్నా చేశారు. మక్తల్‌ మండలంలోని కర్ని పీహెచ్‌సీ వద్ద ధర్నా నిర్వహించారు. లెప్రసీ సర్వే డబ్బులు విడుదల చేయాలని వనపర్తి జిల్లా పెద్దమందడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్‌, ఎర్రుపాలెం మండలాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీగా పీహెచ్‌సీకి వద్దకు చేరుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారిగూడెం పీహెచ్‌సీ వద్ద ధర్నా, దుమ్ముగూడెంలో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వైద్యాధికారికి అందజేశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 పీహెచ్‌సీల ఎందుట ఆశాలు ధర్నా చేసి మెడికల్‌ ఆఫీసర్లకు వినతిపత్రం అందించారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలో వైద్యాధికారి వినరుకి వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, నాంపల్లిలో ఆశాలు ధర్నా నిర్వహించారు. మర్రిగూడ, చండూరులో పీహెచ్‌సీల ఎదుట ధర్నాలు చేశారు. లెప్రసీ పెండింగ్‌ డబ్బులు వెంటనే చెల్లించడంతోపాటు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశావర్కర్లు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో నిరసన తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులకు వినతిపత్రం అందజేశారు.

లెప్రసీ సర్వే బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. వీరికి సీఐటీయూ మద్దతు తెలిపింది. కుషాయిగూడ పీహెచ్‌సీ ఎదుట ధర్నా నిర్వహించారు. యూనియన్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.రేవతి కళ్యాణి పాల్గొని మాట్లాడారు. బాలానగర్‌ డివిజన్‌ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆశాలు ధర్నా నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -