- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పేదలకు అందాల్సిన పెన్షన్లు పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం చేపట్టిన సోషల్ ఆడిట్‌లో బయటపడింది. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా 20వేల శాంపిల్స్ సేకరిస్తే అందులో 2వేల మంది అనర్హులుగా తేలింది. ధనవంతులు, 50ఏళ్లు నిండని వారు, వైకల్యం లేకున్నా వికలాంగుల పెన్షన్లు, చనిపోయినవాళ్లపై ఇతరులు ఇలా అక్రమంగా చేయూత పొందుతున్నట్లు గుర్తించారు. వీళ్లందరికీ పెన్షన్లు కట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
- Advertisement -



