Wednesday, December 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఫిరాయింపులపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

ఫిరాయింపులపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోబుతున్నామని ఆయన అన్నారు.

ఎంఐఎం పార్టీతో కలిసి జీహెచ్ఎంసీలో 300 సీట్లు గెలుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే.. తాజా వ్యాఖ్యలతో ఎలాంటి పరిణామాలు ఎదురుక్కొంటారో చూడాలి. ఇప్పటికే స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై దానం నాగేందర్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారేననే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -