– తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ
– మూడో రోజు కు చేరిన ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్థులు చదువుతోపాటు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజం పట్ల అవగాహన, గుర్తింపు పెరుగుతుందని తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఏడు రోజుల శీతాకాల ప్రత్యేక శిబిరం బుధవారం నాటికి మూడవ రోజుకు చేరుకుంది.
ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని,చేసే పని చిత్తశుద్ధితో సరైన పద్ధతిలో చేస్తే ఉన్నత శిఖరాలకు అధిరోహించొచ్చని సూచించారు. నారంవారిగూడెం సర్పంచ్ మనుగొండ నాగమణి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాల అశ్వారావుపేట వారు సేవా కార్యక్రమానికి మా ఊరు ఎంచుకోవడం సుమారు రెండు కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను పొదలు ను తొలగించి నందుకు ధన్యవాదాలు తెలిపారు. నారం వారి గూడెం కాలనీ సర్పంచ్ కుప్పాల మంగ, కళాశాల ప్రిన్సిపాల్ అనిత లు పిచ్చి మొక్కలు తొలగించే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డేగల నరసింహారావు,ఏపీఓ మానే శ్రీనివాసరావు,అధ్యాపకులు డి. అంజయ్య పి.మారేశ్వరరావు బి.రాంబాబు జీపీఓ ఎస్.తిరుపతి రావు, సెక్రటరీ రమేష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



