Monday, December 29, 2025
E-PAPER
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

మద్దూరి నగేష్‌ బాబు స్మారక పురస్కారం
ధిక్కార కవి మద్దూరి నగేష్‌ బాబు స్మారక పురస్కారానికి ఈ సంవత్సరం కవితా సంపుటాలు ఆహ్వానిస్తున్నాము. 2023 నుంచి 2025 వరకు ప్రచురితమైన కవితా సంపుటాలు 4 కాపీలు పంపాలి.

పైడి తెరేష్‌ బాబు స్మారక పురస్కారం
పైడి తెరేష్‌ బాబు స్మారక పురస్కారానికి ఈ సంవత్సరం కథా సంపుటాలు ఆహ్వానిస్తున్నాము. 2023 నుంచి 2025 వరకు ప్రచురితమైన కథా సంపుటాలు 4 కాపీలు పంపాలి. డా.జి.వి.రత్నాకర్‌ : 7013507228

కలేకూరి ప్రసాద్‌ స్మారక పురస్కారం
కలేకూరి ప్రసాద్‌ స్మారక పురస్కారానికి ఈ సంవత్సరం అనువాద పక్రియలో సంపుటాలు ఆహ్వానిస్తున్నాము. 2023 నుంచి 2025 వరకు ప్రచురితమైన అనువాద కవిత, అనువాద కథా సంపుటాలు 4 కాపీలు పంపాలి.

ఏటూరి వెంకయ్య నాయుడు, శకుంతలమ్మ స్మారక పురస్కారం
ఏటూరి వెంకయ్య నాయుడు, శకుంతలమ్మ స్మారక పురస్కారానికి ఈ సంవత్సరం కవితా సంపుటాలు ఆహ్వానిస్తున్నాము. 2023 నుంచి 2025 వరకు ప్రచురితమైన కవితా సంపుటాలు 4 కాపీలు పంపాలి. ఏటూరి నాగేంద్రరావు :7416665323

కొలకలూరి పురస్కారాలు – 2026

కొలకలూరి సాహిత్య పురస్కారాలలో భాగంగా 1. కొలకలూరి భాగీరథీ కథానిక పురస్కారం, 2. కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారం, 3. కొలకలూరి రామయ్య విమర్శన పురస్కారం కోసం ఆయా ప్రక్రియల్లో ప్రచురితమైన గ్రంథాలు నాలుగేసి ప్రతులను జనవరి 15, 2026లోపు చేరేటట్లుగా పంపండి. గ్రంథాలు పంపవలసిన చిరునామాలు: కథానిక, నవలను : ఆచార్య కొలకలూరి మధుజ్యోతి (సెల్‌: 94419 23172), (పూర్వ ఉపాధ్యక్షులు, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం), తెలుగు శాఖాధ్యక్షులు డ పరీక్ష విభాగం డీన్‌, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి – 517 502. ఆం.ప్ర. చిరునామాకు, విమర్శన గ్రంథాలను : ఆచార్య కొలకలూరి సుమకిరణ్‌ (సెల్‌ : 99635 64664), ఆంగ్లాచార్యులు, అధ్యక్షులు, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి – 517 502. ఆం.ప్ర. చిరునామాకు పంపాలి.
– ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, ఆచార్య కొలకలూరి సుమకిరణ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -