Monday, December 29, 2025
E-PAPER
Homeదర్వాజఅడుగులకు లొంగని దూరముండదు

అడుగులకు లొంగని దూరముండదు

- Advertisement -

బతకడం రాకపోయినా
బతుకుతున్న వాళ్లను చూసి
నా లాగే నేను బతికేస్తున్నాను
దెబ్బలు తినడం అలవాటైంది
జీవితం కొట్టినపుడు బాధ కలుగుతుంది
కొట్టనపుడు కూడా,
కొట్టిన బాధ జ్ఞాపకం వస్తుంది
స్వప్నాన్ని కాపాడుకోవాలి
తుఫాన్‌ వీస్తే కొట్టుకు పోతుంది
ఎన్నో పోరాటాలు చేసి, జమచేసుకొన్న కాలం
ముళ్లమీది నీడలా, చిందర వందరవుతుంది
కొన్ని సమస్యలు బతక నీయవు
కొన్ని బాధ్యతలు చావనీయవు
మనుషులు కలుసుకోకపోతే
దేన్ని, ప్రేమ అంటాం
తోడు లేకపోతే ప్రయాణానికి
అర్థం ఏమని చెపుతాం
దీపాలు కనిపించని ప్రయాణం కావచ్చు,
దారి మలుపులు తిరుగొచ్చు,
అర్థంలేనీ, అందంలేనీ గమ్యం వుండదు
అడుగులకు లొంగని దూరముండదు
చేతిలో నుండి ఎన్ని జారిపోయినా
దొరికినదాన్ని గౌరవించాలి
ఎన్ని ప్రయత్నాలు చేసినా
దొరకని దాన్ని బద్నాం చేయకూడదు
నమ్మకం, ధైర్యం, ఆశలు వున్నాయి కాబట్టే,
మనుషులు రేపటి శుభోదయాన్ని చూస్తామని
ఈ రాత్రీ నిచ్చింతగా నిద్రపోతున్నారు

  • ఆశారాజు, 9392302245
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -