Wednesday, May 21, 2025
Homeక్రైమ్నలుగురు మయన్మార్‌ దేశస్తుల అరెస్ట్‌

నలుగురు మయన్మార్‌ దేశస్తుల అరెస్ట్‌

- Advertisement -

– పరారీలో మరో ఇద్దరు
నవతెలంగాణ-హయత్‌నగర్‌

భారత్‌లోకి చొరబడి అక్రమంగా నివాసముంటున్న నలుగురు మయన్మార్‌ దేశస్తులను ఎల్బీనగర్‌ మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు, హయత్‌నగర్‌ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హయత్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయన్మార్‌ దేశానికి చెందిన మహమ్మద్‌ అర్మాన్‌ అలియాస్‌ సయ్యద్‌ ఉల్‌ అమీన్‌, మహమ్మద్‌ రుమానా అకేథర్‌ అలియాస్‌ ముస్తాకియా, మహమ్మద్‌ నయీమ్‌ అలియాస్‌ హెరల్‌ అమిన్‌, మహమ్మద్‌ హరీస్‌ అలియాస్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌, అయాజ్‌, సోయబ్‌ మాలిక్‌ పెద్ద అంబర్‌పేటలో నివాసముంటున్నారు. 2011లో మయన్మార్‌ సరిహద్దు నుంచి వీరంతా భారత్‌లోకి ప్రవేశించారు. తర్వాత 2014లో వీరంతా అక్రమంగా ఆధార్‌ కార్డులు పొందారు. అలాగే పాన్‌ కార్డు, ఓటర్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంకు ఖాతాలు, ఏటీఎంలు, గ్యాస్‌ పాస్‌ బుక్కులు పొందారు. తాజాగా వీరి గురించి సమాచారం అందుకున్న ఎల్బీనగర్‌, మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు, హయత్‌నగర్‌ పోలీసులు మంగళవారం సంయుక్తంగా దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఐదు ఆధార్‌ కార్డులు, రెండు పాన్‌ కార్డులు, ఐదు ఓటర్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఎల్‌ఐసీ పాలసీ బాండ్లు 2, ఏటీఎం కార్డులు 3, గ్యాస్‌ బుక్‌, యూనియన్‌ బ్యాంక్‌ పాస్‌బుక్‌లు రెండు, ఎస్‌బీఐ పాస్‌ బుక్‌లు 2, ఆంధ్రా బ్యాంకు పాస్‌బుక్‌ ఒకటి, 4 బర్త్‌ సర్టిఫికెట్లు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయాజ్‌, సోయబ్‌ మాలిక్‌ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -