నవతెలంగాణ – మిరుదొడ్డి
స్వయం ఉపాధి కొరకు మహిళా సంఘాల ద్వారా మదర్ యూనిట్ ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందారని ఏపీఎం లక్ష్మీనరసమ్మ, సర్పంచ్ చెప్పాలా శ్రీనివాస్ అన్నారు. బుధవారం మీరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో మహిళలకు మదర్ యూనిట్ ద్వారా కోడి పిల్లలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో మదర్ యూనిట్ ద్వారా అందిస్తున్న కోడి పిల్లల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభం వచ్చే విధంగా మదర్ యూనిట్ ఎంతగానో దోదపడుతుందని సూచించారు. ఈ యొక్క అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామంలో నాటు కోళ్లు తీసుకోవడం వలన ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు చిన్నచిన్న అవసరాలకు ఒక కోడిపిల్ల అమ్ముకుంటే 300 నుండి 500 వరకు కోళ్లను అమ్మడం జరుగుతుందని సూచించారు. కూల్టిఫామును మహిళా సంఘాల ద్వారా స్వయం ఉపాధి కొరకు బ్యాంకు రుణం కూడా ఇవ్వడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సిసి వైకుంఠం , మదర్ యూనిట్ నిర్వాకుడు సంజీవ్, వివో ఏ లో పద్మ, సత్తిరెడ్డి వార్డు సభ్యులు గోపి, తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు మదర్ దీని ద్వారా కోడి పిల్లలను అందించిన ఏపిఎం, సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



