- Advertisement -
– బాన్సువాడ డి.ఎస్.పి విఠల్ రెడ్డి
నవతెలంగాణ-నిజాంసాగర్
మండలంలోని ప్రతి గ్రామాలలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని బాన్సువాడ డి.ఎస్.పి విఠల్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు ప్రజల ప్రోత్సాహంతో మండలంలోని ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో గల నేరస్తుల కదలికలను నిత్యం గమనించాలని ఆయన సిబ్బందికి సూచించారు. నేరాల నియంత్రణ, దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఆయన అభినందించారు. కార్యక్రమంలో బాన్సువాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, ఎస్ఐ శివకుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



