నవతెలంగాణ – కంఠేశ్వర్
స్థానిక మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో కీర్తిశేషులు మాధవి రెడ్డి జయంతి వేడుకలను ఆమె తల్లిదండ్రులు బివి రమణారెడ్డి, లక్ష్మీదేవి, దివ్యాంగుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి రమణారెడ్డి మాట్లాడుతూ.. తమ కుమార్తె మాధవిరెడ్డి మరణించి 11 సంవత్సరాలు అవుతుందని ఆమెకు చిన్నపిల్లలు అంటే అమృతమైన ఇష్టమని ఆమె లేని లోటును దివ్యాంగ బాలల్లో చూసుకుంటున్నామని అందుకే ఆమె పుట్టినరోజును ప్రతి సంవత్సరం దివ్యాంగుల మధ్య జరుపుకుంటున్నామని ఆమె పేరిట మాధవిరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి దివ్యాంగులకు మరియు పేద ప్రజలకు సహాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని దివ్యాంగులు సహాయార్థం 25వేల రూపాయల చెక్కును అందిస్తున్నామని అదేవిధంగా మానసిక దివ్యాంగులకు యోగ నేర్పించి వారిని ప్రయోజకులుగా మారుస్తున్న యోగ ఉపాధ్యాయురాలు వీణ కు వేల 2500 రూపాయలు చెక్కును అందించారు అనంతరం దివ్యాంగులకు మిఠాయిలు మరియు బిస్కెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముబారక్ నగర్ కాలనీవాసులు శ్రీనివాస్ మరియు కవితలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, పాఠశాలల సిబ్బంది మానసిక దివ్యాంగులు, అందులు పాల్గొన్నారు.
స్నేహ సొసైటీలో కీర్తిశేషులు మాధవి రెడ్డి జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


