నవతెలంగాణ – దుబ్బాక
ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) సాధించే వరకు పీఆర్ టీయూటీఎస్ (ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్) విశ్రమించబోదని ఆ సంఘం దుబ్బాక రూరల్ మండల శాఖ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ అన్నారు. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందేనని.. పీఆర్ సీ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం దుబ్బాక లోని మండల వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ జోగు ప్రభుదాస్ చేతుల మీదుగా పీఆర్ టీయూటీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల ప్రయోజనాల పరిరక్షణ కోసం పీ ఆర్ టీయూ ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షులు వేణుగోపాల చారి, జనార్ధన్, రామ్ రెడ్డి, ఎంఆర్ సీ సిబ్బంది గణేష్, శ్రీధర్ ఉన్నారు.
ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



