Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక ఆస్పత్రికి గేటు ఏర్పాటు చేయాలి

స్థానిక ఆస్పత్రికి గేటు ఏర్పాటు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. ఈ ఆస్పత్రి విస్తీర్ణం ఐదు ఎకరాల పైన ఉంటుంది. ఆస్పత్రికి రోజుకు వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. అదేవిధంగా ప్రతివారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా జరుగుతుంటాయి. నిత్యం వైద్యులు, స్థానిక ప్రజలు ఆస్పత్రికి వస్తూ.. పోతూ రద్దీగా ఉంటుంది. కానీ ఆస్పత్రికి గేటు లేకపోవడంతో పక్కనే చుట్టుపక్కల సంచరించే ఊరి పందులు హాస్పిటల్ లోపలికి వస్తున్నాయి. ఇవి డ్రైనేజీ, మోరీల నుంచి నేరుగా ఆస్పత్రిలోకి రావడంతో వాటి నుంచి వచ్చే దుర్వాసన వల్ల రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల డెంగ్యూ, వైరల్ ఫీవర్ లు అధికమవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. దీని కాంపౌండ్ వాల్ కు గేటు లేదు. దీంతో ఆస్పత్రి ఆవరణంలో పందులు సంతరిస్తున్నాయి. ఈ పందుల వలన ఆస్పత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి, ఆస్పత్రికి గేటు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనివల్ల పందుల బెడదను అరకట్టవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -