నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఏ వాడలో కూడా నీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలుగా గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి చేపట్టిన బోర్ల తవ్వకాలపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 8 చోట్ల బోర్లు తవ్వకాలు చేపట్టారు. ఏ గల్లి లో తవ్విన నీళ్లు పుష్కలంగా పడటం గ్రామస్తులు హర్షం వ్యక్తం అవుతుంది. డిసెంబర్ 17న సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 22న సర్పంచుల నూతన పాలకవర్గాల ప్రమాణస్వీకారం ఉత్సవాలు జరిగాయి.
జరిగిన వారం రోజుల్లోనే సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి గ్రామంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టారు. వరుసగా ఎనిమిది చోట్ల బోర్లు వేయించారు వాటి ద్వారా వాడ వాడలో సింగిల్ మోటార్ల ఏర్పాటుతో నీటి సరఫరా చేయించడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు. పాత బస్టాండ్ సమీపంలో ప్రయాణికులకు అత్యవసరమైన మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మాణాలు ప్రారంభించారు. సర్పంచ్ చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ పనితీరుపై అభినందిస్తున్నారు.



