Friday, January 2, 2026
E-PAPER
Homeబీజినెస్తుది వస్తువుల ధరల భారీ పెంపుపై 'ఫైఫా' ఆందోళన

తుది వస్తువుల ధరల భారీ పెంపుపై ‘ఫైఫా’ ఆందోళన

- Advertisement -

రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిక

  • సెంట్రల్ ఎక్సైజ్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2025 తర్వాత వచ్చిన రేటు నోటిఫికేషన్ ద్వారా పొగాకు ఉత్పత్తులపై పన్నుల భారీ పెంపు… రైతులు, గ్రామీణ వాటాదారులలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
  • ఎగుమతి ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం, దేశీయ ధరలు పెరగకపోవడం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, నియంత్రణల కారణంగా సాగు విస్తీర్ణం తగ్గడంతో రైతులు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నారు.
  • అధిక పన్నులు వినియోగాన్ని తగ్గించడంలో చారిత్రాత్మకంగా విఫలమయ్యాయి. బదులుగా అవి అక్రమ వాణిజ్యాన్ని విస్తరించాయి, ఖజానాకు ఆదాయ నష్టాన్ని కలిగించాయి.
  • ప్రస్తుత పన్ను పెంపు వినియోగదారులను స్మగ్లింగ్, అక్రమ ఉత్పత్తుల వైపు నెట్టివేస్తుంది. ఇది నేరుగా భారతీయ రైతులకు హాని కలిగిస్తుంది, విదేశీ ఉత్పత్తిదారులకు లాభం చేకూరుస్తుంది.
  • అధిక పన్నుల పెంపును వెనక్కి తీసుకోవాలని, ఆదాయం తటస్థంగా ఉండేలా రేట్లను తిరిగి జారీ చేయాలని ‘ఫైఫా’ ప్రభుత్వాన్ని కోరింది. ఇది రైతుల జీవనోపాధిని కాపాడుతూనే, స్మగ్లింగ్‌ను నిరుత్సాహపరుస్తుంది.

నవతెలంగాణ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలలోని లక్షలాది మంది వాణిజ్య పంటల రైతులు, వ్యవసాయ కూలీల పక్షాన నిలిచే లాభాపేక్ష లేని సంస్థ ‘ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్స్’ (FAIFA), కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌పై తీవ్రంగా స్పందించింది. ‘చూయింగ్ టుబాకో, జర్దా సెంటెడ్ టుబాకో, గుట్కా ప్యాకింగ్ మెషీన్స్ (సామర్థ్య నిర్ధారణ మరియు సుంకం వసూలు) నిబంధనలు, 2026’ కింద… సిగరెట్ పొడవును బట్టి 1,000 స్టిక్స్‌కు రూ. 2,050 నుండి రూ. 8,500 వరకు ఎక్సైజ్ సుంకాన్ని జనవరి 1, 2026 నుండి అమలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఆకస్మిక మరియు భారీ పెంపు… చట్టబద్ధమైన సిగరెట్ పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది రైతులు, ఎంఎస్ఎంఈలు (MSMEs), చిల్లర వ్యాపారులు, అనుబంధ విలువ గొలుసులపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుందని ఫైఫా హెచ్చరించింది. పన్నుల పరివర్తన ఆదాయ తటస్థంగా ఉంటుందన్న ప్రభుత్వ గత ప్రకటనలకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎఫ్‌సివి (FCV) పొగాకు రైతుల పట్ల… భారతదేశ పొగాకు పన్ను విధానం ఇప్పటికే బహిరంగంగానే వివక్ష చూపిస్తోంది. ఎఫ్‌సివి పొగాకును ఉపయోగించే సిగరెట్లపై ఉన్న అత్యంత అధిక పన్ను రేటు భారం కింద రైతులు ఇప్పటికే నలిగిపోతున్నారు. కిలోగ్రాము ప్రాతిపదికన చూస్తే, బీడీల కంటే 50 రెట్లు ఎక్కువ, నమలే పొగాకు కంటే 30 రెట్లు ఎక్కువ పన్నును వీరు భరిస్తున్నారు. అంతేకాకుండా, తుది ఉత్పత్తిలో ఎఫ్‌సివి పొగాకుపై ఒక్కో మోతాదుకు రూ. 6 కంటే ఎక్కువ పన్ను విధిస్తుండగా, బీడీలు, నమలే ఉత్పత్తులలో ఉపయోగించే ఇతర పొగాకు రూపాలపై ఒక్కో మోతాదుకు ఒక పైసా కంటే తక్కువ పన్ను ఉంది. ఇటువంటి తీవ్రమైన అసమానత… అత్యంత నిబంధనలకు కట్టుబడి ఉండే రైతులను శిక్షిస్తోంది. ప్రస్తుత భారీ ఎక్సైజ్ పెంపు ఈ ఆర్థిక వివక్షను మరింత పెంచుతోంది. ఇది ఎఫ్‌సివి సాగుదారులను అణిచివేస్తుంది, మొత్తం పొగాకు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది.

ఫైఫా ప్రెసిడెంట్ మురళీ బాబు మాట్లాడుతూ: “సెప్టెంబర్ 4, 2025న జీఎస్టీ 2.0ను ప్రకటించేటప్పుడు, పొగాకు ఉత్పత్తుల విషయంలో రిటైల్ అమ్మకపు ధరలో 40% జీఎస్టీ వసూలు చేస్తామని, అయితే మొత్తం పన్ను భారం మారకుండా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. భారతదేశం అంతటా ఉన్న రైతాంగం ఈ ‘ఆదాయ తటస్థత’ హామీని నమ్ముకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -