నవతెలంగాణ – ఆలేరు టౌన్
ఆలేరు ప్రజల సమస్యల పరిష్కారం కొరకు అన్ని పక్షాలు ఒక తాటిపైకి రావాలని, మాజీ ప్రభుత్వ విప్పు, ఆలేరు మాజీ శాసన సభ్యురాలు, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో శనివారం దొంతిరి సోమిరెడ్డి గార్డెన్లో మున్సిపల్ స్థాయి బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు.
ఇటీవల బూతు లెవల్ అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే చేయకుండా, ఒక చోట కూర్చొని ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టడంతో, ఒకే వార్డ్ లో ఉండాల్సిన ఓట్లు వివిధ వార్డులోకి జంపాయాయని గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. బూత్ లెవెల్ అధికారులతో పాటు ఆర్పీలు కూడా ఓటర్ నమోదు ప్రక్రియలో పనిచేశారని చెప్పారు. గల్లంతయిన ఓట్లను సరి చేయాలన్నారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ అని చెప్పారు. జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో నా అభ్యర్థి గెలిస్తే, ఊర్ దత్తత తీసుకుంటాన ని ఎమ్మెల్యే అన్నారని అన్నారు.
ఓటర్లను అనేక విదలుగా బ్లాక్ మెయిల్ చేసే రీతిలో ఎమ్మెల్యే పనితీరు ఉందన్నారు. రైల్వే గేట్ అండర్పాస్ నిర్మాణం కొరకు 6:50 కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి పనులు ప్రారంభించామన్నారు. ఆలేరు సమస్యల పరిష్కారం కొరకు అఖిలపక్ష పార్టీలు బిజెపి, సిపిఐ,ఎం ,ఎంఎల్, కమ్యూనిస్టు పార్టీలు సమస్యల పరిష్కారం కొరకు తూతూ మంత్రంగా పనిచేస్తున్నారని విమర్శించారు. పోరాటాలకు ముందుకు వస్తే బిఆర్ఎస్ పార్టీ మద్దతిస్తుందన్నారు.
ఉద్యమంలో ముందు ఉంటామన్నారు. ఆలేరు పట్టణంలో తను ఎమ్మెల్యేగా ముందు చూపుతో, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. పట్టుదలతో అందరూ కలిసికట్టుగా అభివృద్ధి కొరకు పని చేస్తే సమస్యలు పరిష్కరించబడతాయన్నారు. సబండ వర్గాలు తెలంగాణ కొరకు కట్టుబడి పని చేస్తేనే, తెలంగాణ సాధించామన్నారు. బద్కాన్ని వదిలిపెట్టి ఉద్యమ స్ఫూర్తితో పని చేద్దామన్నారు. ఆలేరు , యాదగిరిగుట్ట మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమన్నారు.
ఆలేరు మున్సిపల్ భవనం కొరకు 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేస్తే, అధికారంలో ఉన్న వారు పనులు ఎందుకు చేపట్టడం లేదని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలేర్ పట్టణ అభివృద్ధి కొరకు చేపట్టిన పనులు ప్రజలకు వివరించాలన్నారు. సమావేశాలు టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం సభ అధ్యక్షత వహించారు. ఆలేరు పట్టణంలో డంపింగ్ యార్డ్ నిర్మాణం కొరకు స్థలం దొరకలేదని చెప్పారు.
మున్సిపల్ నోటిఫికేషన్ రాకముందే, ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలన్నారు. పట్టణంలోని జంగాల కాలనీలను శాంతినగర్ గా పిళ్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో కలెక్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ సమస్యల పరిష్కారం కొరకు దృష్టి సారించాలన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే నిర్ణయాలు ఉంటాయి అన్నారు. ఈ సమావేశంలో బొట్ల పరమేశ్వర్, వస్పరి శంకరయ్య, పోరెడ్డి శ్రీనివాస్, మొరిగాడి వెంకటేష్, మాదాని పిలీప్, ఆడే బాలస్వామి,బేతి రాములు, చింతకింది చంద్రకళ మురాహరి, సీసా మహేశ్వరి, మొరిగాడి ఇందిరా, పంతం కృష్ణ, పాషికంటి శ్రీనివాస్, జింకల రామకృష్ణ యాదవ్, మోర్తాల రమణారెడ్డి, జల్లి నరసింహులు, పత్తి వెంకటేష్, బింగి రవి, కర్రే అశోక్, జంపాల దశరథ, జూకంటి శ్రీకాంత్, జూకంటి ఉపలయ్య, బెదరకోట దుర్గేష్, రచ్చరాం నరసయ్య, మొరిగాడి అశోక్, కె బాలరాజ్, గోరేమియా, దయ్యాల సంపత్, సిస రాజేష్, సరాబు సంతోష్, కుతాటి అంజన్ కుమార్, రాజు, ఎండి జమాల్ ,ప్రశాంత్, ఫయాజ్, శ్రీశైలం, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.



