నవతెలంగాణ – నెల్లికుదురు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినట్లు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గునిగంటి రాజన్న తెలిపారు. మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశాన్ని మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉచిత ఎరువు పురుగు మందులు అందిస్తామాని చెప్పి రైతులను మోసం చేయడమే కాకుండా వారిని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చెందారు.
నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తెచ్చి రైతంగాన్ని ఇబ్బందులో ముంచుతుందని అన్నారు. ప్రభుత్వం రంగ సంస్థలను బడా బడా పెట్టబడుదారులకు కట్టబెడుతూ అప్పుల పాలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలం చెందారని రైతంగానికి వ్యవసాయ కార్మికులకు ఆర్థిక భారాన్ని మోపుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు పేదలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి పెద్ద కుట్ర చేస్తుందని తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) నాయకులు పెరుమాండ్ల బాబు గౌడ్, తోట నరసయ్య, పుల్లయ్య, భూక్య బిక్షపతి, బండ వెంకన్న, నలమాస యాకాంతం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



