మలయాళంలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆయన నటిస్తున్న చిత్రాలన్నీ కూడా రూ.200 కోట్ల వసూళ్లతో అదరగొడుతున్నాయి. ఆయన త్వరలోనే ‘కన్నప్ప’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
బుధవారం మోహన్ లాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్, కనిపించిన తీరు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఆయన ఈ చిత్రంతో మళ్లీ తెలుగు ఆడియెన్స్‌పై తన ముద్రను వేసేలా కనిపిస్తున్నారు.
గూస్ బంప్స్ తెప్పించేలా ఈ గ్లింప్స్‌ను కట్ చేశారు. మోహన్‌లాల్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా గ్లింప్స్ ఉండటం మరో విశేషం. దైవిక శక్తితో ముడిపడి ఉన్న కిరాత అనే పాత్రను ఇందులో మోహన్‌లాల్ పోషించారు.
ప్రస్తుతం విష్ణు మంచు, కన్నప్ప టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే యూఎస్ టూర్‌ను పూర్తి చేశారు. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
క్యారెక్టర్ పోస్టర్‌లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.
కిరాతగా మోహన్‌లాల్
- Advertisement -
- Advertisement -