Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పారిశుద్వానికి ప్రాధాన్యత ఇస్తాం 

పారిశుద్వానికి ప్రాధాన్యత ఇస్తాం 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట
పంచాయతీలో పారిశుద్వానికి  ప్రాధాన్యత ఇస్తామని పసర గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ భూఖ్య సుమలత అన్నారు. ఆదివారం మోద్దుల గూడెం గ్రామంలో సైడ్ కాల్వల పొడుగతీత పనులను ఉప సర్పంచ్ సంజన ఈ ఓ శరత్ లతో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్మా ట్లాడుతూసైడ్ కాలువలు కూడికతో నిండిపోవడం వల్ల మురుకునీరు ప్రవహించకుండా నిలువ ఉండడం వల్ల దోమలు చేరి గుడ్లు పెట్టి వ్యవస్థ పెద్దదై ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుందని అన్నారు. పరిసరాలు బాగుంటే ప్రజలు బాగుంటారన్న సిద్ధాంతానికి అనుగుణంగా సైడ్ కాలువల పూడికతీత పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను దృష్టికి తీసుకువస్తే ఒకటొకటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు ఈ  కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు రాస్ఫూట్ గిరి , తోడుసు కుమార్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -