Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పచ్చదనం..పరిహాసమేనా..?

పచ్చదనం..పరిహాసమేనా..?

- Advertisement -

-నాటిన మొక్కలకు రక్షణ కరువు
-రహదారి పొడవునా కానరాని చెట్లు
నవతెలంగాణ-మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్లతోపాటు,శాత్రజ్పల్లి,పెద్దతూoడ్ల,మల్లారం,కొయ్యుర్, రుద్రారం,ఎడ్లపల్లి, ఆన్ సాన్ పల్లి,నాచారం,వళ్లెంకుంట,కొండంపేట తదితర గ్రామాల్లో ప్రధాన రహదారులకు ఇరువైపులా గత ప్రభుత్వంలో నాటిన మొక్కలకు రక్షణ కరువై వేలాది మొక్కలు చనిపోయాయి.దీంతో ప్రభుత్వ లక్ష్యం నిరుగారిపోవడమే కాకుండా లక్షల ప్రజాసొమ్ము దుర్వినియోగానికి గురైంది. ఫలితంగా పచ్చదనం పరిహాసమైపోయింది.కొన్ని మొక్కలు పశువుల పాలు కాగా మరికొన్ని మొక్కలు వృక్షాలుగా ఎదిగాయి.రహదారి విస్తీర్ణం కోసం వృక్షాలను సైతం తొలగించాల్సి రావడంతో వృక్షాలు నరికివేతకు గురయ్యాయి.దీంతో వృక్ష ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా నరకబడిన మొక్కలకు రెండింతలు నాటితే పచ్చదనంతో పాటు వాహనాల నుంచి వెలువడే పొగ, విషపూరితమైన వాయువుల నుండి వాతావరణానికి రక్షణ కలిగించవచ్చు.దీనిని దృష్టిలో పెట్టుకున్న హైవే అధికారులు మంథని నుంచి కొయ్యుర్ టు కాటారం వరకు ఫోర్టేన్ వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. కానీ వాటి సంరక్షణకు మాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో మొక్కలు ఎండిపోతున్నాయి. అధికారులు మొక్కల సంరక్షణపై దృష్టి సారిస్తే ఆహ్లాదం అందించినవారవుతారని మండల వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతర్గత రోడ్లకు ఇరువైపులా ప్రతీ సంవత్సరం మొక్కలు నాటుతూనే ఉన్నారు. కానీ వాటి పర్యవేక్షణ కొరవడడంతో నీరు లేక కొన్ని మొక్క దశలోనే ఎండిపోతున్నాయి. మరికొన్ని పశువుల పాలవుతున్నాయి.గేదెలు, మేకలు,గొర్లు మేస్తుండటంతో నాటిన మొక్కలు విరిగిపోతున్నాయి. దీంతో మొక్కలు ఎదగడంలేదు. ప్రతీసారి చనిపోయిన మొక్కల చోట అధికారులు కొత్త మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకుంటున్నారు.వాటి సంరక్షణపై దృష్టి సారించి రక్షణ కంచెలు, ట్రీగార్డ్స్ ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -