- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి పరిధిలోని హైదర్ నగర్ లో ఆదివారం మధ్యాహ్నం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గేటెడ్ కమ్యూనిటీలోని స్విమ్మింగ్ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు అర్జున్ మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



