ఉత్తమ ప్రతిభ పురస్కారాలు అందుకున్న బగ్గలి స్వప్న రజక, సురుకుట్ల ఝాన్సీ
నవతెలంగాణ- కంఠేశ్వర్
సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి ప్రతిభ పురస్కారాలు 2026వ సంవత్సరం గాను జనవరి 3న హైదరాబాదులోని రవీంద్రభారతిలో సావిత్రిబాయి పూలే 195వ జన్మదినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్సవ కమిటీ సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ ద్వారా వినతులను స్వీకరించారు. వివిధ రంగాలకు చెందిన వారిలో ప్రతిభను కనబరిచినటువంటి వారికి ప్రతిభ పురస్కారాలను అందజేశారు.
అందులో భాగంగా రాష్ట్రస్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి బగ్గలి స్వప్న రజక కి కుల వృత్తిలో వారు చేస్తున్నటువంటి సేవలకు గాను, సురుకుట్ల ఝాన్సీ వ్యాపార రంగంలో రాణిస్తున్నందున ఇరువురికి ఉత్తమ ప్రతిభ పురస్కారాలు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవంలో వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ.. వారి ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహిళా బీసీ సంక్షేమ సంఘం నాయకులకు రాష్ట్ర ప్రభుత్వానికి నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.



