నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రామన్నపేట శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై ఆదివారం కళా జత ప్రోగ్రాం నిర్వహించారు. బ్యాంక్ అందిస్తున్న సేవలు, టీజీబీ బ్యాంక్ ఆవశ్యకత గురించి పాటల రూపంలో కళాకారులు వివరించారు. ఈ సందర్బంగా బ్యాంక్ మేనేజర్ వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రతి ఒక్కరు బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి అన్నారు. ఖాతా దారులకు పొదుపు అవసరం, డిజిటల్ లావాదేవీలు వాటి ప్రయోజనాలు, రుణాల యొక్క అవగాహన గృహ, కారు, ట్రాక్టర్ రుణాలు పంట రుణాలు సకాలంలో చెలించి ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీ పొందాలన్నారు.
అలాగే సెంట్రల్ ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా, ప్రధాన మంత్రి సురక్ష భీమా, అటల్ పెన్షన్ యోజన వంటి పథకలు మన బ్యాంక్ అందుబాటులో వున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ బేల్దారు నవీన్ , ఉప సర్పంచ్ తెడ్డు గోవర్ధన్ బ్యాంక్ సిబ్బంది అకౌ్టెంట్ హితేష్ ఫీల్డ్ ఆఫీసర్ విజయ్ కుమార్ క్యాషియర్ పూర్ణ చందర్ సిబ్బంది నరేష్ ఐకేపీ సిబ్బంది మాణిక్ రావు ఖాతా దారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



