Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలికల ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ కార్యక్రమం 

బాలికల ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ కార్యక్రమం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఎందరో వీరనారీలకు కేరాఫ్గా ఆర్మూర్ బాలికల ఉన్నత పాఠశాల నిలుస్తుందని మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ అన్నారు.  పట్టణంలోని జంబి హనుమాన్ వద్ద గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎందరో విద్యార్థినీలు ఈ పాఠశాలలో చదువుకొని ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉద్యోగాల్లో ఉన్నారన్నారు. ఇంతటి పేరు ప్రఖ్యాతలున్న ఈ పాఠశాలలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించే అవకాశం కలిగిందన్నారు. 36వ ఆదివారం నిర్వహించిన ఈ స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగాపాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెట్ల కొమ్మలు, చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గోపిరెడ్డి, స్వంచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బొగడమీది ప్రశాంత్, గణేష్, చోలా రాకేష్, వేణు, జహీర్, నూకల ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -