Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం సర్వసభ్య సమావేశము

జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం సర్వసభ్య సమావేశము

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
బాలాజీ ఫంక్షన్ హాల్  నందు బాల్ బ్యాట్మెంటన్ సంఘం సర్వసభ్య సమావేశము నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం నిర్వహించడం జరిగింది. నూతన కార్యవర్గా ఎన్నిక కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ గారు వ్యవహరిస్తూ, గత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిందిగా ప్రకటించారు. నూతన కార్యవర్గ ఎన్నికల అధికారిగా చరణ్ న్యాయవాది వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ సంఘం పరిశీలకునిగా తిరుపతి అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిజామాబాద్ జిల్లా ఒలంపిక్ సంఘం తరపున  ఎన్నికల పరిశీలకులుగా రమణమూర్తి నిజాంబాద్ హాకీ ప్రధాన కార్యదర్శి రావడం జరిగింది. 

నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాట్మెంటన్ సంఘం 2026 —2030   సంవత్సరానికి  నూతన కార్యవర్గ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్ గా కే. దేవన్న (ప్రీమియర్), చీఫ్ పాట్రన్ మానస గణేష్, అధ్యక్షులు గడ్డం శ్రావణ్ రెడ్డి , కార్యనిర్వాహక అధ్యక్షులు టీ విద్యాసాగర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్యామ్, ఉపాధ్యక్షులు జై రాజ్ కుమార్, కాశిరెడ్డి సునీత, బి నాగేష్, జి రాజేష్ ,పి నరేందర్, కోశాధికారి బి రాజేశ్వర్, నిర్వాహణ కార్యదర్శి నాగేష్, సంయుక్త కార్యదర్శులుగా సురేష్ ,ఆనంద్, పి.నికిత ,మానస సురేష్, సలహాదారులుగా మల్లేష్ గౌడ్, యం రాజేందర్, ఎస్ గంగాధర్, కె ప్రేమ్ కుమార్,కార్యవర్గ సభ్యులు కృష్ణ కార్తీక్ ,సాయిబాబా ,శిరీష, శివాని, సాయికుమార్, అనిల్  నువ్వు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి త్వరలో  జిల్లా ఆర్మూర్ ఆల్ఫోర్స్ హై స్కూల్లో నిర్వహించే 70 తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా క్రీడా పోటీలను విజయవంతం చేయాలని నూతన కార్యవర్గం తీర్మానం చేసినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -