ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 211/3
యాషెస్ సిరీస్ ఐదో టెస్టు
సిడ్నీ (ఆస్ట్రేలియా) : యాషెస్ సిరీస్‌లో ఆశలు ఆవిరైన తర్వాత ఇంగ్లాండ్ గాడిలో పడుతోంది!. బాక్సింగ్ డే టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్.. తాజాగా సిడ్నీ టెస్టులోనూ మెప్పిస్తోంది. వర్షం కారణంగా తొలి రోజు 45 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. హ్యారీ బ్రూక్ (78 నాటౌట్, 92 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), జో రూట్ (72 నాటౌట్, 103 బంతుల్లో 8 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీలతో కదం తొక్కారు. ఓపెనర్లు జాక్ క్రాలీ (16), బెన్ డకెట్ (27, 24 బంతుల్లో 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించగా.. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్ (1/53), మైకెల్ నెసర్ (1/36), స్కాట్ బొలాండ్ (1/48) కొత్త బంతితో వికెట్లు పడగొట్టారు. 13 ఓవర్లలోనే 57/3తో ఇంగ్లాండ్ ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో జతకట్టిన జో రూట్, హ్యారీ బ్రూక్ నాల్గో వికెట్‌కు అజేయంగా 32 ఓవర్లలో 154 పరుగులు జోడించారు. జో రూట్ 65 బంతుల్లో ఏడు ఫోర్లతో అర్థ సెంచరీ సాధించగా.. బ్రూక్ 63 బంతుల్లో ఐదు బౌండరీలతో ఫిఫ్టీ అందుకున్నాడు. వర్షంతో 45 ఓవర్ల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. రెండో రోజు ఆట సాధారణ షెడ్యూల్ ప్రకారమే ఆరంభం కానుంది. రెండో రోజు ఆటలో సైతం 90 ఓవర్ల ఆటకు మాత్రమే అంపైర్లు షెడ్యూల్ చేశారు. అంపైర్ల నిర్ణయంపై మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.
బ్రూక్, రూట్ దూకుడు
- Advertisement -
- Advertisement -



