Wednesday, January 7, 2026
E-PAPER
Homeఆటలువచ్చే వారం షెడ్యూల్‌!

వచ్చే వారం షెడ్యూల్‌!

- Advertisement -

ఐఎస్‌ఎల్‌పై ఏఐఎఫ్‌ఎఫ్‌
న్యూఢిల్లీ :
ఈ ఏడాది ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) సీజన్‌ను ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (ఏఐఎఫ్‌ఎఫ్‌) నిర్వహించనుంది. ఏఐఎఫ్‌ఎఫ్‌-ఐఎస్‌ఎల్‌ సమన్వయం కోసం గతంలో కో ఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది ఐఎస్‌ఎల్‌ లీగ్‌ను జాతీయ సమాఖ్య స్వయంగా నిర్వహించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కమిటీ నివేదిక మేరకు ఐఎస్‌ఎల్‌ను ఎటువంటి కమర్షియల్‌ భాగస్వాములు లేకుండా ఏఐఎఫ్‌ఎఫ్‌ నిర్వహించనుంది. ఐఎస్‌ఎల్‌ క్లబ్‌లకు పంపించిన ముసాయిదాలో ఫిబ్రవరి 15 నుంచి 2025-26 సీజన్‌ను ఆరంభించేందుకు ప్రణాళికలు రచించారు. అయితే, నిర్వహణ ఖర్చుల నిమిత్తం ప్రతి క్లబ్‌ రూ.1 కోటి ఫీజును ఏఐఎఫ్‌ఎఫ్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఏదేని క్లబ్‌ ఈ ఫీజు చెల్లించేందుకు నిరాకరిస్తే లీగ్‌లో తర్వాతి సీజన్‌ ఆడేందుకు అర్హత కోల్పోనుంది. ఐఎస్‌ఎల్‌ నిర్వహణ, క్లబ్‌ల సమన్వయంపై ఈ వారంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే వారం ఐఎస్‌ఎల్‌ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -