– ఎక్స్‌లో సీఎం రేవంత్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయిలో నిలపాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ఇలాంటి ఉపాధ్యాయులే సారథులని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను అక్షర దేవాలయాలుగా మలిచి వృత్తినే దైవంగా భావించి తెలంగాణ బిడ్డల భవితను తీర్చిదిద్దే ఇలాంటి ప్రతి గురువుకి బుధవారం ఆయన ఎక్స్ ద్వారా హృదయపూర్వక అభినందనలు ప్రకటించారు. బొంపెల్లి భవాని, రంగయ్య, బర్రి రవిరాజు గురించి ఉపాధ్యాయుల శిక్షణలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడంలో వారు విశేష కృషి చేశారని వివరించారు. ఆ ఉపాధ్యాయుల వివరాలను సేకరించి రాష్ట్రస్థాయిలో సమ్మేళనం నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. వారి ఉత్తమ పద్ధతులను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమలు చేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించబోతున్నామని అన్నారు.
ఆ ఉపాధ్యాయులే మా ప్రభుత్వానికి సారథులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES